
ఫిట్‌నెస్‌తో సంపూర్ణ ఆరోగ్యం
కొరుక్కుపేట: ఫిట్‌నెస్‌తో సంపూర్ణ ఆర్యోగం లభిస్తుందని సినీ దర్శకుడు మణిరత్నం అన్నారు. ఈమేరకు సవేరాలోని ఓ–2 హెల్త్ స్టూడియో 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు దర్శకులు మణిరత్నం, పివాసు, నటి మాణు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ఆరంబించారు. సవేరా నిర్వాహకురాలు నీనారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మిస్ బాడీ బ్యూటీఫుల్, మిస్టర్ ఫిజిక్, మిస్టర్ టోన్డ్ లెగ్స్ పాటీలు నిర్వహించి విజేతలు బహుమతులు అందజేశారు. మణిరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతికయుగంలో ఆరోగ్యంపై అంతగా శ్రద్ద పెట్టడం లేదని ఆన్నారు. ఈక్రమంలో ఫిట్‌నెస్ స్టూడియో రాకతో కాస్త ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగిందన్నారు. ఫిట్‌నెస్‌తో సంపూర్ణ ఆర్యోగం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.