
ఉల్లాసంగా .. ఉత్సాహంగా ముగిసిన ఈషా– 2025
– ఆటపాటలతో ఆకట్టుకున్న విద్యార్థినులు
కొరుక్కుపేట: విద్యార్థినిల్లో ప్రతిభా పాటవాలను వెలికితీసి ప్రోత్సహించేలా రెండు రోజులు పాటూ ఈషా–2025 పేరిట నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం విజయవంతంగా ముగిశాయి. విద్యార్థినులు ఆటపాటలతో, వైవిద్యభరితమైన ప్రదర్శనలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల కళాలయాఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో చివరి రోజు బుధవారం ఆన్ స్టేజ్ ఈవెంట్‌లుగా గ్రూప్ సింగింగ్, డ్యూయల్ అడాప్‌ట్యూన్, మూవీవాక్, గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహించగా, పలువురు సినీ సెలెబ్రెటీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థినిలు ఆయా పోటీల్లో చక్కని ప్రదర్శనలతో కనువిందు చేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పిబి వనిత డిప్యూటీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వి. నప్పిన్నైలు బహుమతులను ప్రదానం చేసి అభినందించారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ విద్యతోపాటు ఎక్స్‌ట్రా కరికుళంలలో కూడా రాణించాలని హితవుపలికారు. పోటీ ప్రపంచంలో అన్నింటిలోనూ తమదైన ముద్ర వేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఉల్లాసంగా .. ఉత్సాహంగా ముగిసిన ఈషా– 2025