
మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
కొరుక్కుపేట: మాదకద్రవ్యాల జోలికి వెళ్లోదని నమో గాడ్ ఛారిటుబుల్ ట్రస్ట్ ట్రస్టీలు నాయకర్ నందగోపాల్ , ఎన్ నాగభూషణం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈమేరకు చైన్నె విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గ తెలుగు(ఎస్‌కెడిటి) మహోన్నత పాఠశాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌కేడీటీ పాఠశాలల కరస్పాండెంట్ , సెక్రటరీ డాక్టర్ సీఎం కిషోర్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరంతోపాటూ మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన ర్యాలీని న్విహించారు . ముందుగా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీని నందగోపాల్, ఎన్ నాగభూషణం తోపాటు విల్లివాక్కం ట్రాఫిక్ పోలీసులు, పోలీసు అధికారులు సమక్షంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఫ్లకార్డులు చేతబట్టి విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం పై చేకూరే నష్టాలను తెలుపుతూ ర్యాలీని విజయవంతంగా చేపట్టారు. అలాగే ఎస్‌కెడిటి ప్రాథమిక, మహోన్నత పాఠశాలలకు చెందిన 700మంది విద్యార్థులకు ఉచితంగా దంత, ఈఎన్‌టీ, జనరల్ చెకప్‌లను ప్రొక్యూర్ హెల్త్‌కేర్ కు చెందిన వైద్యులు చేపట్టి ఆరోగ్య సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌కేడీటీ మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారా సుహాసిని, ఏహెచ్ ఎం. అళగర్ రాజ్ పాల్గొన్నారు.