
చైన్నెలో పారడైజ్ కబాబ్ ఫెస్ట్
సాక్షి, చైన్నె : హైదరాబాద్, బెంగళూరులలో అద్బుత స్పందన నేపథ్యంలో చైన్నెలోనూ పారడైజ్ కబాబ్ ఫెస్ట్‌కు చర్యలు తీసుకున్నారు. చైన్నె పారడైజ్ ఫుడ్ కోర్టులో డిలెంటబుల్ కబాబ్ ఫెస్ట్‌ను బుధవారం ఆ సంస్థ సీఓఓ రాబిందర్ సింగ్, ఉపాధ్యక్షుడు స్వతంత్ర గౌతమ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైన్నె వాసుల ముంగిటకు వివిధ రకాల కబాబ్‌వంటకాలను తీసుకు రావాలన్న ఉద్దేశంతో ఈ ఫెస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జమ్ము, కశ్మీ ర్‌లలో ప్రసిద్ధి చెందిన జాఫ్రానీ కల్మీ కబాబ్, మధ్య ప్రదేశంలో ప్రసిద్ధి చెందిన రేష్మి మలై కబాబ్, తమిళనాడులోని సేలం, నీలగిరిలో ప్రసిద్ది చెందిన చికెన్ టికా కబాబ్, ఉత్తర ప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన భూనా చికెన్ టికా వంటి పలు రకాల కబాబ్‌లను మాంసాహార వంటకాలుగా అందజేస్తున్నామన్నారు. శాఖాహారంగా మహారాష్ట్రాకు చెందిన థెచా పనీర్ టిక్కా కబాబ్, రాజస్థాన్‌లోప్రసిద్ధి చెందిన మథానియా పనీర్ టిక్కా కబాబ్ ప్రత్యేకంగా కొలువు దీర్చామన్నారు. పారడైజ్ ఫుడ్ కోర్టులో ఆహార ప్రియుల కోసం అన్ని రకాల కబాబ్ వంకటాలతో ఈ ఫెస్ట్ జరుగుతున్నట్టు వివరించారు. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ప్యారడైజ్ మరింత నాణ్యత, ప్రామాణిక భద్రతతో రుచికర వంకటాలను చైన్నె వాసు ముంగిటకు ఈ ఫెస్ట్ ద్వారా తీసుకొచ్చామన్నారు.