6.5 టన్నుల గుట్కా స్వాధీనం
తిరువళ్లూరు: ఆంధ్రా నుంచి లారీలో తరలిస్తున్న నిషేధిత గుట్కాపాటు 21 కిలోల గంజాయి, గోడౌన్‌లో నిల్వ వుంచిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనలో ప్రమేయం వున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీని సైతం సీజ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఐచర్ లగేజ్ వ్యాన్ ఆపి పోలీసులు తనిఖీ చేశారు. అందులో 3.5 టన్ను ల గుట్కా, 21 కిలోల గంజాయి వున్నట్టు నిర్ధారించిన పోలీసులు వాటిని లారీ సహా సీజ్ చేశారు. అనంతరం లారీడ్రైవర్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పట్టుబడిన డ్రైవర్ తూత్తుకుడి జిల్లా కురుంబూర్ ప్రాంతానికి చెందిన పెరుమాల్ కుమారుడు మణివణ్ణన్(27), క్లీనర్ అదే ప్రాంతానికి చెందిన రాజీ(62)గా గుర్తించారు. వీరు ఆంధ్రా నుంచి గుట్కాను తరలించి అంబత్తూరు వద్ద గోడౌన్‌లో నిల్వవుంచి విక్రయిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించి అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. గోడౌన్‌లో మరో మూడు టన్నుల గుట్కాను గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. గోడౌన్‌లో పనిచేసే తెనాకాశీ జిల్లాకు చెందిన రామచంద్రన్(25), పొన్నుస్వామి(42)సహా మరో ఇద్దరితో కలిపి మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. 6.5 టన్నుల గుట్కా, 21 కిలోల గంజాయి తో పాటు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు లారీ ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
నలుగురి అరెస్టు
21 కిలోల గంజాయి సైతం సీజ్
లారీ స్వాధీనం


