ప్రైవేటు పరిశ్రమ డ్రైవర్ దారుణ హత్య
– మృతదేహంతో బంధువుల రాస్తారోకో
వేలూరు: వేలూరు జిల్లా పొన్నై సమీపంలోని కోడివూరు గ్రామానికి చెందిన ఏకాంబరం(30) ప్రైవేటు కంపెనీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఏకాంబరం రాత్రి ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో పొన్నై అనకట్టు సమీపంలో ఏకాంబరం కాళ్లు, చేతులు, గొంతు వేర్వేరుగా కోసి వేసి రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బంధువులు మృత దేహాన్ని తరలించరాదని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. దీంతో ఎస్పీ మదివాణన్ నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఈ మేరకు పొన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనంతరం పోలీసులు బంధువులతో చర్చించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేటు పరిశ్రమ డ్రైవర్ దారుణ హత్య


