102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం | - | Sakshi
Sakshi News home page

102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం

Apr 30 2025 12:24 AM | Updated on Apr 30 2025 12:24 AM

102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం

102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం

● ఖాకీలపై సీఎం వరాల జల్లు ● అబల భద్రతకు పింక్‌ గస్తీ వాహనాలు

సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్‌ అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటనలు చేశారు. ఇందులో పోలీసులపై వరాల జల్లు కురిపించారు. ఇందులో కోయంబత్తూరు జిల్లా నీలంపూర్‌లో రూ.4.88 కోట్లతో కొత్త పోలీసు స్టేషన్‌ ఏర్పాటు. శివగంగై జిల్లా కీలడిలో రూ. 2.83 కోట్లతో కొత్త పోలీసు స్టేషన్‌ ఏర్పాటు. తిరునెల్వేలి జిల్లాలోని మెలచెవల్‌లో రూ.4.88 కోట్లతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, తిరుప్పూర్‌ జిల్లా పల్లడం, కళ్లకురిచ్చి జిల్లా ఉత్కోట్టంలో రూ.2.83 కోట్లతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు ఉన్నాయి. అలాగే నామక్కల్‌ జిల్లా కొక్కరాయన్‌ పేటలో 4.88 కోట్లతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, తిరువణ్ణామలై జిల్లాలోని తిరువణ్ణామలై టెంపుల్‌ పోలీస్‌ రూ. 2.83 కోట్లతో ఏర్పాటు. కన్యాకుమారి జిల్లాలోని కుజితురైలో రూ.2.15 కోట్లతో కొత్త రైల్వే పోలీసు స్టేషన్‌ ఏర్పాటు. మధురై మున్సిపల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని చింతామణిలో రూ.6.57 కోట్లతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుమధురై సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని మడక్కుళంలో రూ. 6.57 కోట్లతో కొత్త పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటును ప్రస్తావించారు. చైన్నెలో పోలీసు ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రణాళిక, యాంటీ నార్కోటిక్స్‌ ఇంటెలిజెనన్స్‌ యూనిట్‌ ఏర్పాటు. చెంగల్పట్టు జిల్లాలో నేర పరిశోధన విభాగం కొత్త యూనిట్‌ ఏర్పాటు, మైలాడుతురై, రాణిపేట జిల్లాలో రెండు నేర దర్యాప్తు విభాగం యూనిట్లు ఏర్పాటకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కొత్త పోస్టులు..

రైల్వే పోలీస్‌ స్టేషన్ల పనిని సమన్వయం చేయడమే లక్ష్యంగా చైన్నెలోని ప్రధాన కార్యాలయంలో కొత్త టెలికమ్యూనికేషన్లు పరికరాలతో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటును సీఎం స్టాలిన్‌ ప్రస్తావించారు. స్నిఫర్‌ డాగ్‌ యూనిట్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతాల సమన్వయం పరిపాలనా పనుల కోసం ఎస్పీ స్థాయిలో ఇద్దరు కొత్త పోలీసు అధికారులు పోస్టుల సృష్టి. ఆవడి ట్రాఫిక్‌ పోలీస్‌ డివిజన్‌ రెండుగా విభజించబడింది. రెడ్‌హిల్స్‌లో కొత్త ట్రాఫిక్‌ పోలీసు డివిజన్‌ ఏర్పాటు, చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కొత్త పోస్టుల సృష్టించనున్నట్లు వివరించారు. యాంటీ–ఐడల్‌ యూనిట్‌, సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌, రైల్వే పోలీస్‌ (చైన్నె, తిరుచ్చి రైల్వే జిల్లాలు) కన్సల్టెంట్‌ పోస్టుల సృష్టి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని పోలీస్‌ స్టేషన్లు అప్‌గ్రేడ్‌కు నిర్ణయించారు. చైన్నె నగరంలోమహిళల భద్రతకు రూ.12 కోట్లతో 80 పింక్‌ గస్తీ వాహనాల కొనుగోలు. పోలీసుల కోసం 10 కొత్త బస్సుల కొనుగోలు. ఖైదీల ఎస్కార్ట్‌ కోసం 20 కొత్త వాహనాల కొనుగోలు. పోలీసు అధికారులకు సామాగ్రిని రవాణా చేయడానికి 10 ట్రక్కుల కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.

అన్నా పతకాల సంఖ్యను 100 నుండి 150కి పెంపు

సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ ఆధునీకరణ, డార్క్‌ వెబ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఇనన్‌స్టాల్‌. డిజిటల్‌ రేడియో ఫ్రీక్వెన్సీ మరో నాలుగు జిల్లాలు, రెండు నగరాలకు విస్తరణ, మొబైల్‌ పోరెన్సిక్‌ వాహన విభాగం ఏర్పాటుకు నిర్ణయించినట్లు స్టాలిన్‌ వెల్లడించారు. సేలం, విల్లుపురం, వెల్లూరు, తంజావూరు, మధురై, తిరునెల్వేలిలలోని ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైనన్స్‌ ప్రయోగశాలల్లో కొత్తగా సైకోట్రోఫిక్‌ పదార్థాల పరీక్షా యూనిట్‌ ఏర్పాటు. చైన్నె, ఆవడి, తాంబరం మినహా అన్ని నగరాలు, జిల్లాల్లో ప్రత్యేక సోషల్‌ మీడియా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తమిళనాడు పోలీస్‌ కళాశాలలో కంప్యూటర్‌–సహాయక బోధన నిర్వహణ ప్రాజెక్టు ప్రారంభం. తమిళనాడులోని ఇంటెలిజెనన్స్‌ డివిజన్‌, స్పెషల్‌ ఆపరేషనన్స్‌లో అత్యుత్తమ పనికి ఇక, సీఎం పతకం. ఏటా ఇచ్చే అన్నా పతకాల సంఖ్యను 100 నుంచి 150కి పెంపు, ఏటా ఇచ్చే సీఎం పతకాల సంఖ్య 3 వేల నుంచి 4 వేలకు పెంపు. పోలీస్‌ క్లబ్‌లను ఏర్పాటు. పశ్చిమ ప్రాంతానికి ‘‘హ్యాపీనెస్‌’’ పోలీస్‌ సంక్షేమ పథకం విస్తరణ, తమిళనాడు స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌లో ప్రతి బృందంలోనూ మహిళా అధికారి నియామకం ఉండే విధంగా నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement