తిరుత్తణి: తిరుత్తణి పట్టణంలోని ప్రధాన రోడ్లు ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను హైవే శాఖ అధికారులు గురువారం తొలగించారు. తిరుత్తణి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా హైవే శాఖ ద్వారా ప్రధాన రోడ్లు విస్తరణ చేపట్టి తారురోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా కాలంగా ఇరుకై న రోడ్లతో ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యేవారు. ఈ క్రమంలో హైవే శాఖ ద్వారా పట్టణంలోని చిత్తూరు రోడ్డు, బైపాస్ రోడ్డు, అరక్కోణం రోడ్డు, ఎంపీసీ రోడ్డు సహా ప్రధాన రోడ్లలో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో గురువారం మార్కెట్ వద్ద రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణాలతో పాటు బస్టాండు సమీపం సుందరవినాయర్ ఆలయానికి ఎదురుగా వుంచిన దుకాణాలను పోలీసుల బందోబస్తు నడుమ హైవే శాఖ డివిజినల్ సహాయ ఇంజినీరు రఘురామన్, సహాయ ఇంజినీరు జ్ఞాణఅరుల్‌రాజ్ సమక్షంలో ఆక్రమణ దుకాణాలు తొలగించారు.


