లండన్‌లో జరిగిన వలియంట్ సింఫోనిలో పాల్గొని చైన్నెకు వచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజాకు అభినందనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ తరపున తమిళనాడు వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ గురువారం ఇళయరాజను కలిసి పుష్పగుచ్చం, శాలువతో సత్కరించారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. – సాక్షి, చైన్నె
ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, చైన్నె: ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ చైన్నె శాంతి భద్రతల విభాగం నార్త్ విభాగం ఐజీ కేఎస్ నరేంద్రన్‌నాయర్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం ఐజీగా స్థాన చలనం కల్పించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్. లక్ష్మిని చైన్నె సీఐడీ విభాగం ఐజీగా బదిలీ చేశారు. ఇక్కడున్న పర్వేష్‌కుమార్‌ను గ్రేటర్‌చైన్నె నార్త్ శాంతి భద్రతల విభాగానికి స్థానం చలనం కల్పించారు.


