తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు అనుసందానంలోని తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుడు నాట్య ప్రదర్శన చేసిన ఐదు సభల్లో తొలి సభ రత్నసభగా ప్రసిద్ధి చెందిన తిరువలంగాడు ఆలయంకు కారైక్కాల్ అమ్మవారు తల సాయంతో చేరుకుని స్వామిని దర్శించుకున్నట్లు, దీంతో ఆమెను సాక్షాత్తూ శివుడు అమ్మయార్ అని పిలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో కారైక్కాల్ అమ్మవారు అని పేరు ప్రసిద్ధి చెందింది. కారైక్కాల్ అమ్మవారి వేడుకల వివరాలను అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు రెండు రోజుల పాటూ ృవేడుకలు తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆదివారం రాత్రి కారైక్కాల్ అమ్మవారికి అభిషేక పూజలు చేపట్టి పుష్ప అలంకరణలో ఆలయ రాజగోపురం వద్ద ఊంజల్ సేవ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి సైతం రెండవ రోజు అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వేడుకగా కారైక్కాల్ అమ్మయార్ ఉత్సవం


