తమిళసినిమా: నటుడు, మక్కళ్ నీతి మయ్యం పార్టీ ధ్యక్షుడు కమలహాసన్ ఆలోచనలు దూర దృష్టితో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా తన మక్కళ్ నీతి మయ్యం పార్టీ తరపున వేసవి సెలవులలో విద్యార్ధులకు ఆంగ్ల భాషలో సరళంగా మాట్లాడటాకి మన పాఠశాలు పేరుతో ఉచిత విద్యా తరగతులను నిర్వహించతలపెట్టారు. విద్యార్ధుల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఈ ఉచిత ఆంగ్ల భాషా ఉచ్చరణ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టారు. అందులో భాగంగా మదురై, అరుప్పుకోట్టై, పరమకుడి ప్రాంతాల్లో మన పాఠశాలలు పేరుతో ఆంగ్ల ఉచ్ఛారణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న పరీక్షల్లో విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని మక్కళ్ నీతి మయ్యం పార్టీ నిర్వాహకులు పేర్కొన్నారు. కమలహాసన్ పన్‌బాట్టు మయ్యం ( కమలహాసన్ సంప్రదాయ కేంద్రం) మన పాఠశాలలు పేరుతో నిర్వహించనున్నారు. ఈ ఉచిత ఆంగ్ల ఉచ్ఛారణ తరగతుల్లో ఉచిత పుస్తకాలు, ఉచిత వైఫై సౌకర్యాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికాలోని ఉన్నత పాఠశాల విద్యార్దుల చేత లీప్ అనే సంస్థ ఇండియాలో ఉచిత ఆంగ్ర భాష బోధనలు నిర్వహిస్తోందని, కాగా ఆ సంస్థతో కలిసి మన పాఠఽశాలలు విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచిత ఆంగ్ల భాష ఉచ్చరణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరగతులను ఏప్రిల్ నెల నుంచీ జూన్ వరకూ, అంటే ఆరువారాల పాటు జరుగుతాయని మక్కళ్ నీతి మయ్యం పార్టీ నిర్వాహకులు పేర్కొన్నారు.
రూ.20 కోట్లు మోసం
● ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్
అన్నానగర్: చైన్నె, కోయంబత్తూరుతో సహా తమిళనాడు అంతటా 52 శాఖలతో పనిచేస్తున్న సంస్థ దీనా కలర్‌ల్యాబ్. ఈ కంపెనీ మేనేజర్ జయవేల్ చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. మా కంపెనీకి చెందిన చైన్నె ఎల్లీస్ రోడ్, కోయంబత్తూరు బ్రాంచిల్లో పనిచేసిన గోపాలకృష్ణన్(40), కృష్ణమూర్తి (42), గౌతమ్ (30) రూ.20 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని, వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి అర్ధకేజీ బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి వస్తువులు, రూ.30 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, విలాసవంతమైన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
21 నుంచి పర్యాటక ఉత్సవం
సాక్షి, చైన్నె: పర్యాటక శాఖ నేతృత్వంలో మార్చి 21 నుంచి 23 వరకు పర్యాటక ఉత్సవం నిర్వహించనున్నారు. వందకు పైగా స్టాల్స్‌ను ఈ ఉత్సవం నిమ్తితం నందంబాక్కం వర్తకకేంద్రంలో ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర సంపద, విభిన్న పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి, పర్యాటక పరిశ్రమ ప్రోత్సహం, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ వేడుక జరగనుంది. కార్యక్రమంలో, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఆతిథ్య నిపుణులు , పెట్టుబడిదారులు దేశీయ , అంతర్జాతీయ పర్యాటక వ్యవస్థాపకులు, సంస్థలతో సహా రాష్ట్ర సమగ్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భాగస్వాములు అవకాశాలను గుర్తించనున్నారు. అలాగే, సాంప్రదాయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, వెల్నెస్ టూరిజం , సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
సెంగోట్టయన్‌కు బుజ్జగింపు
సాక్షి, చైన్నె: సీనియర్ నేత సెంగోట్టయన్‌ను బుజ్జగించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి సిద్ధమైనట్టున్నారు. ఇందుకు అనుగుణంగా సోమవారం పరిణాలు చోటు చేసుకున్నాయి. సెంగోట్టయన్‌ను అసెంబ్లీ ఆవరణలో పార్టీ నేతలు తంగమణి, వేలుమణి, కేపి మునుస్వామి,కడంబూరు రాజులు రంగంలోకి దిగారు.సెంగ్టోయన్‌తో చాలా సేపు వీరు మాట్లాడారు. ఆయన్ని బుజ్జగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అసెంబ్లీలో కడంబూరు రాజుతో పదేపదే సెంగోట్టయన్ మాట్లాడుతుండటం గమనార్హం. కాగా, గత కొంత కాలంగా అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణిస్వామికి దూరంగా సెంగోట్టయన్ ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ కార్యాక్రమాలకు, పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి సైతం సెంగోట్టయన్‌దూరంగానే ఉన్నారు. ఈ సమయంలో సోమవారం ఉదయం ఓ ప్రచారం ఊపందుకుంది. సెంగోట్టయన్ ద్వారా అన్నాడీఎంకేను కూటమిలోకి ఆహ్వానించడం, పళణి పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంగోట్టయన్ కూటమి సీఎం అభ్యర్థిగా బీజేపీ ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టుగా వచ్చిన ఈ ప్రచారంతో అన్నాడీఎంకే సీనియర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సెంగోట్టయన్‌ను బుజ్జగించే పనిలో పడటం గమనార్హం. అదే సమయలంలో సెంగోట్టయన్ విషయంగా ప్రశ్నలు సందిస్తే దాట వేసిన పళణి స్వామితాజాగా పార్టీలో ఎలాంటి అంతర్గత సమరాలు లేవు అని, అందరూ ఐక్యతతో ఉన్నామని వ్యాఖ్యలు చేశారు.
మక్కళ్ నీతి మయ్యం ఆధ్వర్యంలో వేసవిలో ఆంగ్ల ఉచ్ఛారణ తరగ


