సేలం: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూలో నిలిచి ఉన్న భక్తుడు అకస్మాత్తుగా శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడి మృతిచెందాడు. కారైకుడికి చెందిన ఓంకుమార్ (50) అనే భక్తుడు ఆదివారం ఆలయంలో రూ.100ల క్యూలో దర్శనం కోసం నిలిచి ఉన్నాడు. ఆదివారం సేలవు రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా ఓంకుమార్‌కు శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆలయ సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఓంకుమార్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు.


