తమిళసినిమా: మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి మమిత బైజూ. ఆ చిత్రంతో దక్షిణాది చిత్త పరిశ్రమ దష్టిని తనపై తిప్పుకుంది. అంతే వెంటనే తమిళంలో జీవి ప్రకాష్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కొద్దిరోజులు కోలీవుడ్ ఈమెను పట్టించుకోలేదు. అలాంటిది అనూహ్యంగా నటుడు విజయ్ కథా నాయకుడుగా నటిస్తున్న జననాయకున్ చిత్రంలో నటించే అదష్టం నటి మమిత బైజూకు దక్కింది. నటి పూజా హెగ్డే కథానాయక నటిస్తున్న ఇందులో మమిత బైజూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీంతో మరింత పెరిగిందని చెప్పాలి. ఇటీవల టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కాగా తాజాగా నటుడు విష్ణు విశాల్‌కు జంటగా నటించే అవకాశం ఈ మాలీవుడ్ భామను వరించింది. ఇంతకుముందు విష్ణు విశాల్ కథానాయకుడిగా ముండాసు పట్టి , రాక్షసన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రామ్ కుమార్ తాగారా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మరోసారి నటుడు విష్ణు విశాల్ కథనాయకుడిగా నటించనున్నారు. దీంతో దర్శకుడు రామ్ కుమార్, విష్ణు విశాల్ కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రం కానుంది. ఇందులోనే నటి మమిత బైజూ నాయికగా నటించనునుంది. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని జి. త్యాగరాజున్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిట్ వర్గాలు శనివారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


