నేతలను తీర్చిదిద్దడమే లక్ష్యం
సాక్షి,చైన్నె: భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలను అవపోషణ చేసుకున్న నాయకులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తామని నయంతా విశ్వవిద్యాలయం ప్రకటించింది. చైన్నెలో కొత్తగా ఈ విశ్వవిద్యాలయ ఆవిర్భావ ప్రకటనను శుక్రవారం చేశారు. మొదటి బ్యాచ్ ఆగస్టు 2025లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. అత్యాధునిక క్యాంపస్‌తో ఉత్తమ పారిశ్రామక వేత్తల బృందం మద్దతుతో ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భవించినట్టుగా నయంతా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సీఈఓ రంజన్ బెనర్జీ తెలిపారు. స్థానికంగా ఈ వివరాలను ఆయన వెల్లడిస్తూ, నయంత విశ్వవిద్యాలయం పూణేలో 100 ఎకరాలతో రూపుదిద్దుకుని ఉందన్నారు. నయంతా అంటే శ్రీన్యూ హోప్ఙ్ అని అర్థం వస్తుందని, భారతదేశం అంతటా విద్యార్థులకు ఆలోచించే విద్యను అందించడంలో ముందుంటామన్నారు. విద్యాసంస్థ వ్యవస్థాపక సభ్యుడు రమేష్ మంగలేశ్వరన్, అకడమిక్ హెడ్ డి.పార్థసారథి పాల్గొన్నారు.


