బ్రేకప్‌కు కారణం ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌కు కారణం ఇదేనా?

Mar 11 2025 1:30 AM | Updated on Mar 11 2025 1:29 AM

అక్యూస్ట్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి

తమిళసినిమా: తారల ప్రేమ, బ్రేకప్‌ల వంటి వ్యవహారాలకు సినిమారంగంలో సౌండ్‌ ఎక్కువ. అయితే ఇందులో తప్పెవరిది అని చెప్పడం అంత సులభం కాదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెత ఉన్నా, ఇక్కడ పొగ రాకున్నా నిప్పు రాజేస్తారు. ఇకపోతే నటీనటులు తమ ప్రేమ వ్యవహారాన్ని కొంత కాలం గుట్టుగా ఉంచుకున్నా, ఏదో సందర్బంగా దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్‌ చేస్తారు. అలాంటి సంఘటనలు సక్సెస్‌ అయితే బాగానే ఉంటుంది. విఫలం అయితేనే చర్చ అవుతుంది. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి ఇలాంటిదే. నిజం చెప్పాలంటే పాన్‌ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన తమన్నా గ్లామరస్‌ పాత్రల్లో మాత్రం హద్దులను చెరిపేస్తారు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రేమ వ్యవహారాలకు చాలా కాలం దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది రెండేళ్ల క్రితం బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ ప్రేమలో పడ్డారు.ఈ విషాయన్ని చాలా గుంభనంగానే ఉంచారు. అయితే నిజం చాలా కాలం దాచబడదు అన్నట్లుగా ఒక వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్‌ వర్మలు బహిరంగంగా సుంభనాలు పెట్టుకున్నారు. అలా నెటిజన్లకు చిక్కడంతో తమ ప్రేమ విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పక తప్పులేదు. అవును మేం ప్రేమలో పడ్డాం అని ఇద్దరూ ప్రకటనలు ఇచ్చారు. అంతే కాదు ఆ తరువాత ఈ ప్రేమ జంట మరింతగా సన్నిహితంగా మెలగసాగారు. పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా రెండేళ్లు సాగిన తరువాత ఇప్పుడు సడన్‌గా నటి తమన్నా ప్రియుడితో బ్రేకప్‌ అంటూ ప్రచారం రచ్చ రచ్చగా మారింది. వీరి బ్రేకప్‌ వ్యవహారాన్ని వారి సన్నిహిత వర్గాలు దృవపరిచారు కూడా. అయితే నటి తమన్నా, నటుడు విజయ్‌వర్మల ప్రేమ ముగియడానికి కారణం ఏమిటన్న దాని గురించి అప్‌డేట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. హిందీ నటుడు విజయ్‌వర్మ ప్రేమపై నమ్మకం పెంచుకున్న తమన్నా ఆయనతో కలిసి ఏడడుగులు వేసి జీవితంలో సెటిల్‌ అవ్వాలని భావించారట. దీంతో ఆ విషయంపై ఆమె ప్రియుడు విజయ్‌వర్మతో పలు మార్లు మాట్లాడినట్లు, అయితే అందుకు నటుడు విజయ్‌వర్మ సిద్ధంగా లేకపోవడమే వీరి బ్రేకప్‌కు కారణం అని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇటు తమన్నా గానీ, అటు నటుడు విజయ్‌వర్మ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

తమిళసినిమా: జసన్‌ స్టూడియోస్‌, సచిన్‌ సినిమాస్‌ సంస్థలతో కలిసి శ్రీ దయాకరన్‌ సినీ ప్రొడక్షన్స్‌, ఏఐవై స్టూడియోస్‌ సంస్థల అధినేతలు ఏఎల్‌.ఉదయ, దయ.ఎన్‌.పన్నీర్‌సెల్వం, ఎం.తంగవేల్‌ కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం అక్యూస్ట్‌. నటుడు ఉదయ, అజ్మల్‌, యోగిబాబు, దర్శకుడు ప్రభుసాలమన్‌, నిర్మాత టీ.శివ,ప్రభాకర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో కన్నడ నటి జాన్విక నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రభు శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రణాళిక ప్రకారం చిత్ర షూటింగ్‌ను జనవరి 2వ తేదీన చైన్నెలోని ఆల్బర్ట్‌ ధియేటర్‌లో ప్రారంభించి ఏకధాటిగా 54 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. సేలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను సేలంలోని మోడరన్‌ థియేటర్‌ వద్ద నిర్వహించిన షూటింగ్‌తో పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది నటుడు ఉదయ కేరీర్‌లోనే భారీ బడ్జెట్‌ కథా చిత్రంగా నిలిచిపోతుందన్నారు. నరేన్‌ బాలకుమారన్‌ సంగీతాన్ని అందించిన ఇందులో మూడు ఐటమ్‌ సాంగ్స్‌ చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ పాడటం విశేషం అని పేర్కొన్నారు. నిందుతులందరూ నేరస్తులు కాదనీ, అలా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలా దాదాలుగా మారుతున్నారనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం అక్యూస్ట్‌ అని చెప్పారు. చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయన్నారు. ప్రస్తుతం నిర్మానాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయనీ దర్శకుడు తెలిపారు.

అక్యూస్ట్‌ చిత్ర యూనిట్‌

బ్రేకప్‌కు కారణం ఇదేనా? 1
1/1

బ్రేకప్‌కు కారణం ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement