మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

Published Mon, Nov 20 2023 12:40 AM | Last Updated on Mon, Nov 20 2023 12:40 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం ఘన నివాళులర్పించారు. వాడ వాడలలోని ఇందిరా గాంధీ విగ్రహాలకు కాంగ్రెస్‌ వాదులు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. స్వీట్లు, చాకెట్లు పంచి పెట్టారు. చైన్నెలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరితో పాటు నేతలు ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ సమైక్యను చాటే విధంగా నేతలతో అళగిరి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు గోపన్న, పొన్‌ కృష్ణమూర్తి, రంజన్‌కుమార్‌, భాస్కర్‌, తమిళ్‌ సెల్వన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement