అన్నానగర్: ప్రసిద్ధి చెందిన కులశేఖరపట్నం ముత్తారామన్ ఆలయంలో దసరా ఉత్సవాలు గత నెల 15న ధ్వజారోహణంతో ప్రారంభమై 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ఉపవాస దీక్షలు చేసిన లక్షలాది మంది భక్తులు ఆలయానికి వచ్చిన కానుకలను చెల్లించారు. ఆరు రోజులుగా కానుకలను లెక్కించారు. లెక్కింపులో రూ.4 కోట్ల 11 లక్షల నగదు, 137.80 గ్రాముల బంగారం, వెండి 2 కిలోల 973.50 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి.
లైంగికదాడి కేసులో యావజ్జీవం
అన్నానగర్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చెంగల్పట్టు జిల్లా, పడాళం సమీపంలోని కొడి తాండలం గ్రామానికి చెందిన భూపతి (30). చెంగల్పట్టు ప్రాంతంలో షేర్ ఆటో నడుపుతున్నాడు. ఫిబ్రవరి 19, 2019న చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రి సమీపంలో 17 ఏళ్ల ప్లస్‌టూ విద్యార్థినిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ విషయమై విద్యార్థిని బంధువులు చెంగల్‌పట్టు అఖిల మహిళా కోర్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు భూపతిని అరెస్ట్ చేసి చెంగల్పట్టు పోక్సో కోర్టులో కేసు పెట్టారు. కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి తమిళరసి భూపతికి జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత విద్యార్థికి రూ.మూడు లక్షలు అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది భువనేశ్వరి వాదనలు వినిపించారు.