
సదస్సులో పాల్గొన్న ఐఏఎస్‌లు
సాక్షి, చైన్నె : పవన విద్యుత్ శక్తికి భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడనుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు, వినూత్న ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. చైన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విండ్ ఎనర్జీ ఇండియా –2023 నేతృత్వంలో మూడు రోజుల సమ్మిట్, ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ప్రపంచ విద్యుత్‌రంగంలో పవన విద్యుత్‌శక్తి కీలక పాత్ర గురించి ఇందులో చర్చించారు. తమిళనాడు విద్యుత్ కార్పొరేషన్ సీఎండీ రాజేష్ లఖాని, భారతదేశంలోని డానిష్ రాయబారి హెచ్‌ఈ ఫ్రెడ్డీస్వనే, ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డీవీ గిరి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌విండ్ ఎనర్జీ డైరెక్టర్‌జనరల్ డాక్టర్ రాజేష్ కత్యాల్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు విష్ణు, హన్స్‌రాజ్ వర్మలు ఈ సదస్సుకు హాజరయ్యారు. తమిళనాడులోని వనరులు, పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవసరాలు, పాలసీలను గురించి రాజేష్ లఖాని, విష్ణు, హన్స్ రాజ్ వర్మలు వివరించారు. విద్యుత్ అవశ్యకతను గుర్తు చేస్తూ, ప్రభుత్వ సహకారం, సాంకేతికత ఆవిష్కరణను గుర్తుచేశారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్, తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడి ప్రమోషన్, గైడెన్స్ తదితర అంశాలను ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సదస్సులో భాగంగా దేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రతినిధి హాజరై ప్రసంగించారు. అలాగే జర్మనీ, స్పెయిన్,ప్రాన్స్, అమెరికా, తదితర దేశాల నుంచి పవన విద్యుత్‌ఉత్పత్తి సంస్థలు, తమ పరికరాలను ప్రదర్శనకు ఉంచాయి.
పవన విద్యుత్ ఇండియా– 2023 సదస్సు ప్రారంభం