
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
ఆదివారం సాయంత్రం రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో సినీ సంగీత దర్శకుడు సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
అన్నానగర్: అవినాసి సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో సినీ సంగీత దర్శకుడు సహా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. చైన్నెకి చెందిన తమిళ ఆదియాన్(50) ఆస్ట్రేలియాలో ఉంటూ వస్తున్నాడు. ఇతకి చైన్నెకి చెందిన సంగీత దర్శకుడు శివకుమార్ (49), దర్శకుడు మూవేందర్ (55), రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజన్ (50) అనే స్నేహితులు ఉన్నారు.
వీరంతా చైన్నె నుంచి లగ్జరీ కారులో కేరళకు వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. తిరుపూర్ జిల్లా అవినాసి బైపాస్ రోడ్డులో వస్తుండగా వీరు కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.
కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో అవినాసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరిశీలించిన డాక్టర్ తమిళ ఆదియాన్, శివకుమార్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.