కమల్‌ పార్టీలో చేరిన వినోదిని | - | Sakshi
Sakshi News home page

కమల్‌ పార్టీలో చేరిన వినోదిని

Jun 15 2023 7:44 AM | Updated on Jun 15 2023 8:43 AM

- - Sakshi

నటుడు కమలహాసన్‌ నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉంటూనే తన మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జనాల్లోకి వెళ్లిన కమలహాసన్‌ మరో ఏడాదిలో పార్లమెంట్‌ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు.

అందులో భాగంగా పలువురిని పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా నటి వినోదిని తాజాగా మక్కళ్‌ నీది మయ్యం పార్టీలో చేరారు. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రంతో నటిగా పరిచయమైన ఈమె ఆ తరువాత జిగర్తండా, ఓకే కణ్మణి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇటీవల విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటి ఐశ్వర్యరాయ్‌ స్నేహితురాలిగా నటించారు.

కాగా ఈమె తరచూ సినీ, రాజకీయాల గురించి మాట్లాడుతూ విడుదల చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తాజాగా మక్కళ్‌ నీది మయ్యం పార్టీలో చేరినట్లు తెలుపుతూ, ఆ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement