Is actress Megha Akash to marry a politician's son? - Sakshi
Sakshi News home page

మేఘా ఆకాష్‌కు పెళ్లి?

Jun 9 2023 6:30 AM | Updated on Jun 9 2023 9:10 AM

- - Sakshi

 నటి మేఘా ఆకాష్‌ పెళ్లికి సిద్ధమవుతుందా? ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న విషయం ఇదే. చైన్నెలో పుట్టి పెరిగిన నటి మేఘా ఆకాష్‌ తండ్రి తమిళుడు. తల్లి మలయాళి. చైన్నెలోనే చదువు పూర్తి చేసిన మేఘా ఆకాష్‌ నటిగా రంగప్రవేశం చేసింది మాత్రం టాలీవుడ్‌లో. 2017లో లై అనే చిత్రం ద్వారా నితిన్‌కు జంటగా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత ఛల్‌ మోహన రంగా తదితర చిత్రాలలో నటించింది. తమిళంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత ఇక్కడ ఒరు పక్క కథై, శింబు సరసన వందా రాజాదాన్‌ వరువేన్‌, అధర్వకు జంటగా భూమరాంగ్‌, ధనుష్‌ సరసన ఎన్నై నోక్కి పాయుమ్‌ తూటా తదితర చిత్రాలలో నటించింది. హిందీలోనూ నటిస్తున్న మేఘా ఆకాష్‌ పెళ్లికి రెడీ అయ్యిందని, ఒక రాజకీయనాయకుడు కొడుకుతో త్వరలోనే ఏడు అడుగులు వేయనున్నుట్లు ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

దీనిపై స్పందించిన ఆమె తల్లి మేఘా ఆకాష్‌ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. అవన్నీ వదంతులేనని ఒక భేటీలో పేర్కొన్నారు. మేఘా ఆకాష్‌ నూతన చిత్రం విడుదల సమయంలో కూడా ఇన్ని ఫోన్‌కాల్స్‌ వచ్చేవి కావని, ఇప్పుడు వరుసగా ఫోన్స్‌ వస్తున్నాయని అన్నారు. అయినా తన కూతురు పెళ్లి విషయాన్ని అందరికీ ముందుగానే వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇలాంటి వదంతులు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని ఆమె అన్నారు. కాగా మేఘా ఆకాష్‌ ప్రస్తుతం తమిళంలో విజయ్‌ఆంటోనికి జంటగా నటించిన మళై పడిక్కాద మనిదన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement