మూడేళ్ల కుమార్తె సహా మహిళా ఇంజినీర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మూడేళ్ల కుమార్తె సహా మహిళా ఇంజినీర్‌ ఆత్మహత్య

Jun 5 2023 8:22 AM | Updated on Jun 5 2023 8:39 AM

- - Sakshi

ఉద్యోగం చేయడానికి వెళ్లొద్దని భర్త మందలించడంతో ఓ మహిళా ఇంజినీర్‌

తమిళనాడు: ఉద్యోగం చేయడానికి వెళ్లొద్దని భర్త మందలించడంతో ఓ మహిళా ఇంజినీర్‌ తన మూడేళ్ల చిన్నారితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెట్టికులం ఎన్జీవో కాలానికి చెందిన మదన్‌ కుమార్‌ (30). ఇతను సొంతంగా కారు కలిగి నడుపుతున్నాడు. ఇతని భార్య శరణ్య (24). వీరి కుమార్తె జిష్ణు(3). శరణ్య ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. కొద్ది రోజుల క్రితం జ్ఞాపకశక్తి సామర్థ్యం కలిగించే శిక్షణ కేంద్రంలో పనికి వెళుతున్నారు. అయితే పనికి వెళ్తే బిడ్డను చూసుకునే వారు లేకపోవడంతో మదన్‌ కుమార్‌, అతను భార్య శరణ్యను పనికి వెళ్లవద్దని చెప్పాడు.

ఈ కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విరక్తి చెందిన శరణ్య తన చిన్నారి జిష్ణును ఉరి వేసి.. తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శివకంచి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శరణ్య, జిష్ణు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు ఆమె కుటుంబం సభ్యులతో పాటు అతని బంధువులను ప్రశ్నిస్తున్నారు.

చైన్నె – బెంగళూరు హైవేలో ఘోరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement