మహిళా లెక్చరర్‌కు వేదింపులు.. కాలేజీ సమీపంలోనే దాడి.. | - | Sakshi
Sakshi News home page

మహిళా లెక్చరర్‌కు వేదింపులు.. కాలేజీ సమీపంలోనే దాడి.. ఎదురు తిరిగితే..

May 1 2023 6:00 AM | Updated on May 1 2023 4:18 PM

అన్నానగర్‌ (తమిళనాడు): మహిళా అధ్యాపకురాలిని లైంగికంగా వేధించిన అధ్యాపకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కప్పలూరులోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో మదురైకి చెందిన ఓ మహిళ తాత్కాలిక లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఉసిలంబట్టికి చెందిన రఘుపతి (42)కూడా అదే కళాశాలలో తాత్కాలిక లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

అతను ఆమెను తరచూ లైంగికంగా వేధిస్తున్నాడు. గతనెల 26న కళాశాల సమీపంలో అతను మహిళా లెక్చరర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగిన ఆమెను చంపుతానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రఘుపతిని పోక్సో చట్టం కింద ఆదివారం అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement