బట్టలు ఆరబెడుతూ కరెంట్ షాక్ కు గురై మహిళ మృతి | Woman dies due to electric shock | Sakshi
Sakshi News home page

బట్టలు ఆరబెడుతూ కరెంట్ షాక్ కు గురై మహిళ మృతి

Apr 3 2023 7:25 AM | Updated on Apr 3 2023 7:25 AM

Woman dies due to electric shock - Sakshi

నాగరాజ్‌ భార్య కీర్తన(30) ఉతికిన బట్టలను మిద్దె పైన కేబుల్‌ వైర్‌పై

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వరదాపురంలో శనివారం విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి చెందింది. పూండి యూనియన్‌ వరదాపురం గ్రామానికి చెందిన నాగరాజ్‌ భార్య కీర్తన(30) ఉతికిన బట్టలను మిద్దె పైన కేబుల్‌ వైర్‌పై ఆరవేయడానికి ప్రయత్నించింది.

ఆ సమయంలో ఆమెకు విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుమార్తె తండ్రికి సమాచారం ఇచ్చింది. నాగరాజ్‌ సంఘటన స్థలానికి వచ్చి 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement