చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె.భవ్య అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జయ పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల రక్షణ చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లల సెల్‌ఫోన్ వినియోగం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలకు డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచితంగా న్యాయసహాయం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకట రత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఫ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవ్య


