చివ్వెంల(సూర్యాపేట) : న్యాయమూర్తులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల మన్ననలు పొందవచ్చని జిల్లా ప్రధాన జడ్జి పి.లక్ష్మీశారద అన్నారు. ఇటీవల బదిలీపై వెళ్లిన జిల్లా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత సన్మాన కార్యక్రమం బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీశారద హాజరై మాట్లాడారు. మమతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి పి.శివరామ్ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వరవళి, ‘బార్’ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


