బుల్లెట్‌ రైలు సాధనకు 21న వంటావార్పు | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు సాధనకు 21న వంటావార్పు

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

సూర్యాపేట : మొదటి అలైన్‌మెంట్‌ ప్రకారం బుల్లెట్‌ రైలు కారిడాన్‌ను సూర్యాపేట మీదుగా కొనసాగించాలంటూ ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన వంటా వార్పును విజయవంతం చేయాలని బుల్లెట్‌ రైలు సాధన సమితి కోకన్వీనర్లు పెద్దిరెడ్డి రాజా, ధర్మార్జున్‌ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేటలోని తిరుమల గ్రాండ్‌లో జరిగిన బుల్లెట్‌ రైలు సాధ న అఖిలపక్ష పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణ సమావేశంలో వారు మాట్లాడారు. వంటావార్పు సక్సెస్‌ కోసం ఈ నెల 13న పట్టణంలోని కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ భవనంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్‌ చల్లమళ్ల నర్సింహ, కొత్తపల్లి శివకుమార్‌ బూర వెంకటేశ్వర్లు, వెలుగు వనిత, భూపతి రాములు, జీడి భిక్షం, అనంతుల మధు, బొమ్మగాని శ్రీనివాస్‌, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement