సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో జరగనున్న 36వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ (కెప్టెన్), విగ్నేష్, మున్నర్, కార్తీక్, వినాయకుమార్, అక్షిత్, తేజ, గణేష్, రిషివర్ధన్, విగ్నేష్, వినయ్, అరవింద్, లష్మిప్రసాద్, చందు, స్టాండ్ బైలుగా హరీష్, లోకేష్, కోచ్ నవీన్, మేనేజర్ ఖాజా ఎంపికై నట్లు వారు పేర్కన్నారు.
కాంట్రాక్టు కార్మికుల
వేతనాలు పెంచాలి
సూర్యాపేట(సూర్యాపేట అర్బన్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, స్కీం వర్కర్ల వేతనాలు పెంచాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కామల్ల శ్రీను అధ్యక్షతన జరిగిన భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మికుల వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. కార్మికులకు కనీసం పేస్కేల్ అమ లు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన పేర్కొ న్నారు. తక్షణమే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజేషన్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా నెలకు రూ.42 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు వి.నరసింహారావు, దేశోజు మధు, జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, నాగవెల్లి రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిక్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలను బుధవారం నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ చేపట్టారు. స్వయంభువులు, ప్రతిష్ఠాఅలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాలభోగం, సహస్రనామార్చన పూజలు చేశారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉన్న ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాకార మండపాల్లో నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు చేపట్టారు. సాయంత్రం తిరుమాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
ఎంజీయూ ఇండోర్ స్టేడియం పోటీలకు సిద్ధం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సిద్ధంగా ఉందని ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మద్దిలేటి పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ చైర్మన్ శివనాగిరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, వైస్ చైర్మన్ సోనిబాలను కలిసి ఇండోర్ స్టేడియం వివరాలు సమర్పించారు. ప్రభుత్వం చేపట్టబోయే వివిధ క్రీడా పోటీలకు ఎంజీయూలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉపయోగించుకోవాలని కోరారు.


