తిరుమలగిరి (తుంగతుర్తి) : ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చని తుంగతుర్తి డివిజన్ ప్రాంతీయ ఉద్యాన అధికారిని వి.ప్రమీత, ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు అన్నారు. తిరుమలగిరి మండలం నందాపురం శివారులో సాగు చేస్తున్న తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి ఆయిల్ పామ్ తోటను బుధవారం వారు సందర్శించి మాట్లడారు. శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు అందించే షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఎరువులు, నీటి యాజమాన్యాన్ని కొనసాగించాలన్నారు. ఆయిల్ పామ్ తోటలు సాగుతో ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. వారి వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.


