ఫ రాష్ట్ర నీటిపారుదల శాఖ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ లిఫ్ట్ పనుల పురోగతిపై
అసంతృప్తి
ఫ గడువులోగా పూర్తి కాకుంటే
అనుమతులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశం
కోదాడ(కోదాడరూరల్) : మండల పరిధిలో జరుగుతున్న రెడ్లకుంట లిఫ్టు నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి కావాలని, లేకుంటే అనుమతులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల, భారీ నీటిపారుదల వాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం రెడ్లకుంట వద్ద జరుతున్న లిఫ్ట్ పనులను నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పనులు ప్రారంభించి రెండున్నరేళ్లవుతున్నా ఎందుకు పూర్తిచేయడం లేదని కాంట్రాక్టర్‌పై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్లకుంట లిఫ్ట్‌కు నీటిని అందిచాల్సిన చెక్‌డ్యాం పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే శాంతినగర్ రాజీవ్ లిఫ్ట్ పనులను ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలన్నారు. లిఫ్ట్ పూర్తయితే రెడ్లకుంట, నల్లబండగూడెం, దోరకుంట, కూచిపూడి, కాపుగల్లు గ్రామాల్లో 4,460 ఎకరాలను సాగు నీరందనుందన్నారు. కరువు ప్రభావం దృష్ట్యా రైతులు వరిసాగు చేయొద్దని మంత్రి సూచించారు. అనంతరం బాలాజీనగర్‌లో జవహర్ నవోదయ పాఠశాల భవన సముదాయంతోపాటు పట్టణంలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఝెర్నేని కుసుమబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అలసకాని శరభేశ్వరరావు, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, కోదాడ మున్సిపల్ కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు.


