సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

సూర్యాపేట అర్బన్‌: సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్మ భిక్షం భవనంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొన్ని మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈనెల 10న కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కరువు జిల్లాలకు నిధులను తక్షణం అందించాలని, నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలన్నారు. బియ్యం ధరలను అదుపులో ఉంచాలన్నారు. ఎల్లావుల రాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉస్తెల నారాయణరెడ్డి, ధూళిపాల ధనంజయ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్‌ రావు, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, కంబాల శ్రీనివాస్‌, ఎస్కే లత్తు, బద్దం కష్ణారెడ్డి, హనుమంతరావు, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, సాయి బెల్లి తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement