కార్యాలయం లేని వ్యవసాయ శాఖ
కోదాడ : కోదాడ పట్టణంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా యి. ఈ వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదులు చేస్తు న్నా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కలెక్టర్ స్వయంగా ఆదేశించినా కోదాడలో మున్సి పల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
రూ.5కోట్ల స్థలం ఆక్రమించినా..
కోదాడ పట్టణం నడిబొడ్డున ఆజాద్ నగర్‌లో ప్రస్తుత ప్రాథమిక సహకార సంఘం భవనం సమీపంలో కోదాడ వ్యవసాయ శాఖకు 500 గజాల స్థలం ఉంది. ప్రస్తుతం ఇక్కడ గజం స్థలం రూ.లక్షకుపైగానే పలుకుతోంది. దీనిలో 50 ఏళ్ల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు గోదాము నిర్మించి దానిలో విత్తనాలను నిల్వ చేసేవారు. కాలక్రమేణా పట్టణం విస్తరించడంతోపాటు ఈ గోదాము శిథిలావస్థకు చేరడంతో వాడకుండా వదిలేశారు. ఇదే అదునుగా కొందరు గోదాము ముందు చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకొనేవారు. ఆ తర్వాత గోదాములో కొంత భాగాన్ని కూల్చివేసి పక్కా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మున్సిపాలిటీ పన్ను కట్టించుకుంటుండగా, విద్యుత్ శాఖ కనెక్షన్ ఇచ్చింది. వీటిని పట్టుకొని సదరు ఆక్రమణదారులు స్థలం మాదేనని చెప్పుకుంటున్నారు. ఇటీవల దీనిపై ఆరోపణలు రావడంతో విచారించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, అవసరమైతే దానికి విద్యుత్ కనెక్షన్ తొలగించి, నీటిసరఫరా ఆపివేయాలని ఆదేశించారు. కానీ, స్థానిక అధికారులు కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఫ కోదాడలో ప్రభుత్వ స్థలాల్లో
అక్రమార్కుల పాగా
ఫ కలెక్టర్ ఆదేశాలిచ్చినా చర్యలు
తీసుకోని అధికారులు
ఫ ప్రజా ఫిర్యాదులూ బుట్టదాఖలు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోదాడ పట్టణంలోని యాదవ బజార్‌లో ఉన్న పాత గ్రంథాలయ స్థలం. గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో పదేళ్ల క్రితం కూల్చివేశారు. అప్పటి
నుంచి ఆ స్థలం ఖాళీగా ఉంటుండడంతో ఈ ఏడాది మే నెలలో స్థానిక ఓ ప్రజాప్రతినిధి భారీ డబ్బా కొట్టును తీసుకొచ్చి సదరు స్థలంలో పెట్టాడు. ఈ స్థలాన్ని ఆక్రమించడానికే చూస్తున్నాడని ఆ వార్డుకు చెందిన పలువురు మున్సిపల్
అధికారులకు ఫిర్యాదు చేసి ఆరు నెలలవుతుంది. అయినా మున్సిపల్ అధికారులు నేటికీ ఆ డబ్బా కొట్టును
తొలగించలేదు. దీంతో ఆక్రమణకు అధికారులు ఆమోదముద్ర వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోదాడలో వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏడీఏతోపాటు ఏఓలు, ఏఏఓలు ఉన్నారు. వీరికి కనీస కార్యాలయం లేదు. గతేడాది వరకు కోదాడ పశువుల సంత వద్ద ఉన్న రైతు విశ్రాంతి భవనంలో ఈ కార్యాలయం కొనసాగింది. ఇది శిథిలావస్థకు చేరడంతో సంవత్సరం క్రితం గుడిబండ రోడ్డులో ఉన్న రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లోకి మార్చారు. పట్టణ నడిబొడ్డున ఉన్న తమ విలువైన స్థలాన్ని ఇతరులు ఆక్రమిస్తున్నా పట్టించుకోకుండా వదిలేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇతరశాఖల కార్యాలయాల్లో కాలం వెల్లదీస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ కార్యాలయాన్ని నిర్మించుకుంటే ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వ స్థలం కాపాడుకున్నట్లు అవుతుందని పలువురు అంటున్నారు.


