మురసు.. ముసురు | - | Sakshi
Sakshi News home page

మురసు.. ముసురు

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

ఫ తుంగతుర్తి నియోజకవర్గం మినహా అంతటా చిరుజల్లులు

ఫ నేలకొరిగిన వరిచేలు

ఫ మొక్కలపైనే నానిపోతున్న పత్తి

భానుపురి (సూర్యాపేట) : మురసు తుఫాను కారణంగా జిల్లాలో ముసురు పట్టింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులతో మొదలై పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాన్‌ కారణంగా వరిచేలు నేలకొరిగాయి. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో మంగళవారం విద్యాసంస్థలకు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సెలవు ప్రకటించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొనడంతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తూ మార్కెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

తెల్లవారుజాము నుంచి..

మురసు ప్రభావంతో ఈనెల 3, 4వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులతో వర్షం మొదలైంది. తుంగతుర్తి నియోజకవర్గం మినహా అంతటా ముసురు పట్టింది. అత్యధికంగా మేళ్లచెరువులో 3.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేటలో 1.4 మిల్లీ మీటర్లు, ఆత్మకూర్‌ 1.5, మోతె 1.2, చివ్వెంల 1.0, పెన్‌ పహాడ్‌ 0.4, మునగాల 0.8, నడిగూడెం 1.4, అనంతగిరి 0.7, కోదాడ 1.1, చిలుకూరు 1.4, గరిడేపల్లి 1.4, నేరేడుచర్ల 1.0, పాలకీడు 0.5, మఠంపల్లి 1.4, హుజూర్‌నగర్‌ 1.9, చింతలపాలెం 1.9 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

నేడు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

తుఫాను ప్రభావంతో బుధవారం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటిస్తూ సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేనారెడ్డి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ ఎల్సోజు చామంతి నరేష్‌ ప్రకటించారు. కాగా.. మంగళవారం సైతం మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించగా రైతులను ధాన్యం తీసుకువచ్చేలా సహకరించిన 30 మంది కమిషన్‌ దారులకు షోకాసు నోటీసులు జారీ చేసినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఫసియుద్దీన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement