మహాసభలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహాసభలను విజయవంతం చేయాలి

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

తుంగతుర్తి: నల్లగొండలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీలకు అతీతంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, అన్ని అనుబంధ సంఘాల ప్రజలు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే కుట్రలపై రైతులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఏకకాలంలో పూర్తి రుణమాఫీ చేసి, నూతన రుణాలు అందించాలని కోరారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే పంట బీమా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతాంగ వ్యతిరేక విధానాలపై చర్చించి, భావి ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని నాగార్జున రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లా సుదర్శన్‌, సీపీఎం గ్రామ కార్యదర్శి పాలబిందెల జానయ్య, బంధు సోమయ్య, కందుకూరి చంద్రయ్య పాల్గొన్నారు.

ఫ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

మల్లు నాగార్జున రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement