పత్తి ఏరేందుకు కూలీల కొరత | - | Sakshi
Sakshi News home page

పత్తి ఏరేందుకు కూలీల కొరత

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

కూలీలు దొరకడం లేదు

20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాను. దసరా పండుగకు ముందే పత్తి చేను ఏరడానికి సిద్ధమైనా కూలీలు దొరక్క పత్తిని ఏరలేకపోయాము. ఇప్పుడు తుఫాను వస్తుండటంతో పత్తి దెబ్బతింటుందేమోనని భయంగా ఉంది.

– శంకర్‌, కౌలు రైతు, తిరుమలగిరి

తిరుమలగిరి (తుంగతుర్తి) : వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడి క్షీణించగా.. మరోవైపు కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరుమలగిరి, తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో చేలల్లో పత్తి ఏరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూలీలు దొరకడం లేదు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పత్తిని అధికంగా వేశారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి పత్తి ఏరివేతకు రావడంతో తీవ్రమైన కూలీల కొరత ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో కూలీలను తీసుకురావాల్సి వస్తుండటంతో.. పత్తి ఏరినందుకు కేజీకి రూ.13 నుంచి రూ.14 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీనికి అదనంగా ఆటో కిరాయిలు రైతులే భరించాల్సి వస్తోంది. గత నాలుగైదు రోజులుగా తుఫాన్‌ ప్రభావంతో చేలల్లోని పత్తి రాలిపోతోందని, వర్షం పడితే సరుకు నల్లబడి మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement