ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో స్పెషల్ ఫౌండేషన్ కోర్స్‌లో శిక్షణ పొందుతున్న ట్రైన్ ఐఏఎస్ అధికారుల బృందం ఆదివారం ఆత్మకూర్ (ఎస్)మండలం ఏపూరు గ్రామపంచాయతీని సందర్శించింది. ఈ బృందానికి సూర్యాపేట డీఎల్‌పీఓ నారాయణరెడ్డి, ఎంపీఓ ప్రియాంక, ఏపూరి సర్పంచ్ కల్లేపల్లి చంద్రమోహన్, ఉప సర్పంచ్ చింతరెడ్డి మంజుల, కార్యదర్శి లింగయ్యలు స్వాగతం పలికి సన్మానించారు. ఈ బృందం గ్రామంలో అమలవుతున్న పథకాల తీరును మూడు రోజులపాటు పరిశీలించనుంది.


