మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో ఆది వారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీప్రహ్లాద యోగానంద లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు అనంతరం నిత్య కల్యాణ తంతు పూర్తిచేసి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ప్రతిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశం అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర
ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఫయాజ్
కోదాడ : రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోదాడకు చెందిన డీలర్ ఎస్‌కె.ఫయాజ్ ఎన్నికయ్యారు. ఆది వారం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ భవనంలో జరిగిన డీలర్ల సంఘం సమావేశంలో తనను ఏకగ్రీవగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటేరాజు, ఉపాధ్యక్షుడు ఖాజామోహినొద్దీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా క్షేత్రంలో తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. మాలధారులు తరలివచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు.


