భానుపురిలో ‘చెత్త’శుద్ధి కరువు | - | Sakshi
Sakshi News home page

భానుపురిలో ‘చెత్త’శుద్ధి కరువు

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. వీటి వల్ల దుర్వాసన వస్తుండడంతో పట్టణంలోని వివిధ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరించేందుకు రావాల్సిన మున్సిపల్‌ వాహనాలు సమయానికి రాకపోవడంతో గృహ యజమానులు విధిలేని పరిస్థితుల్లో చెత్తను రోడ్ల పక్కన పడేస్తున్నారు. దీంతో వివిధ కాలనీలు, ప్రధాన రహదారుల వెంట చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.

చాలా వార్డుల్లో ఇలాగే..

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, చాలా వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకటి రెండుసార్లు కూడా చెత్త సేకరణ వాహనాలు రావడం లేదని వాపోతున్నారు. రోజూ ఇంట్లో పోగయ్యే చెత్తను ఎక్కడ వేయాలో తెలియక రోడ్ల పక్కన పడేస్తున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి పేరుకుపోతున్న చెత్త కుప్పల్లో దోమలు వృద్ధి చెందడంతో పాటు పందులు సంచరిస్తున్నాయి. చెత్త నుంచి వెలువడే దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు.

ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలే..

అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ

ప్రతిరోజూ రాని చెత్త సేకరణ వాహనాలు

చాలా కాలనీల్లో దుర్వాసనమయం

భరించలేక పోతున్నామని ప్రజల ఆవేదన

అన్ని వార్డుల్లోనూ రోజువారీగా

చెత్తను తరలించాలని వేడుకోలు

తీరని సమస్యగా..

వర్షాకాలం ముగిసినా పారిశుద్ధ్య సమస్యలు మాత్రం తగ్గడం లేదు. చెత్త కుప్పల కారణంగా దోమలు పెరిగి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్‌ యంత్రాంగం చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి వార్డులో రోజువారీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement