నేటి నుంచి మళ్లీ రేషన్‌ బియ్యం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మళ్లీ రేషన్‌ బియ్యం

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

రేషన్‌ షాపులకు రవాణా చేస్తున్నాం

భానుపురి (సూర్యాపేట) : మూడు నెలల విరామం తర్వాత మళ్లీ రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల కోటాకు సంబంధించిన బియ్యాన్ని సోమవారం నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా రేషన్‌ కార్డుల సంఖ్య ఆధారంగా బియ్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు సుమారు 7 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. జిల్లాలోని 3,72,658 రేషన్‌ కార్డులకు 612 రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం అందించనున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం తరలింపు ప్రక్రియ పూర్తి కావొచ్చింది.

పేదలకు కొంత ఊరట

రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ తిరిగి ప్రారంభం కావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనివ్వనుంది. గత ఆగస్టులో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఈ నెలలో పంపిణీ చేపడుతోంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందన్న ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయ డం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగనుంది.

ఇప్పటికే దుకాణాలకు కోటా..

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థపై 10,84,469 మంది ఆధారపడి ఉన్నారు. అర్హులైన రేషన్‌ కార్డుదారులకు ప్రతినెలా ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తున్నారు. జిల్లాకు ఈ నెలలో 6,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించగా, వీటిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు తరలించారు.

మూడు నెలల తర్వాత పంపిణీకి సిద్ధం

ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ

ఈ నెల కోటా బియ్యం కేటాయింపు

రేషన్‌ బియ్యం పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఈ నెల కోటాను అలాట్‌ చేసింది. గోదాంల నుంచి రేషన్‌ షాపులకు బియ్యాన్ని రవాణా చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపుల్లో బియ్యం నిల్వలు ఉన్నాయి.

– శ్రీధర్‌రెడ్డి, పౌరసరఫరాల డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement