విద్యారంగం బలోపేతానికి కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగం బలోపేతానికి కృషిచేయాలి

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

కట్టంగూర్‌ : ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లోని నిర్వహించిన టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా 7వ మహాసభల్లో వారు మాట్లాడారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందితున్నప్పటికీ ఆ ఫలాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చేరాలన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతున్నా..యువతలో నిరుద్యోగ, నిరాశ ఎందుకో పెరుగుతున్నాయో పాలకులు ఆలోచించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వారే కాకుండా సమాజానికి దిశా నిర్ధేశకులుగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల నమోదు పెరుగుతుందన్నారు. టీఎస్‌యూటీఎప్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుదన్నారు. ఇన్‌చార్జి అదపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం వారు యూటీఎఫ్‌ మేళాను ప్రారంభించారు. కార్యక్రమంలో టప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పెరుమాళ్ల వెంకటేశం, సోమయ్య, తుమ్మల వీరారెడ్డి, మిట్టపల్లి మురళయ్య, సర్పంచ్‌ ముక్కాముల శ్యామలశేఖర్‌, ఎడ్ల సైదులు, బడుగు అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, రాజు, సరళ, కొమ్ము శ్రీనివాస్‌, అరుణ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, నాగేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement