‘కోహెన్స్‌ ఫార్మా’ను మూసివేయాలి | - | Sakshi
Sakshi News home page

‘కోహెన్స్‌ ఫార్మా’ను మూసివేయాలి

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొనసాగుతున్న కోహెనన్స్‌ ఫార్మా ఫ్యాక్టరీని జనావాసాలకు దూరంగా తరలించాలని, లేదంటే శాశ్వతంగా మూసివేయాలని సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటీవల ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలి కార్మికుడు చనిపోయాడని ఆరోపిస్తూ ఆదివారం ఫ్యాక్టరీ గేటు ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. కోహెన్స్‌ ఫ్యాక్టరీ నాసిరకం మెటీరియల్‌ దిగుమతి చేసుకొని, ఉత్పత్తిని కొనసాగిస్తున్నందున, రియాక్టర్లు, బాయిలర్స్‌ పేలిపోయి కార్మికుల ప్రాణాలతో చలగాటమాడుతున్న యాజ మాన్యాన్ని అరెస్టు చేయాలన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి రేణుక, మారసాని చంద్రకళ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌, సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌లైన్‌ తుంగతుర్తి డివిజన్‌ కార్యదర్శి పేర్ల నాగయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, స్థానిక 6వ వార్డు కౌన్సిలర్‌ సునీల్‌రెడ్డి, సక్రూ నాయక్‌, శివరామ్‌, శేషగిరి, సమీప తండాల వాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement