ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

సూర్యాపేట : ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న నిర్వహించనున్న ఆటో కార్మికుల బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యా నికి ఈ–ఆటోలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆటో మీటర్‌ చార్జీలను పెంచాలని కోరారు. అక్రమంగా యాప్‌ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాలను నియంత్రించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, డిఆర్టియు యూనియన్‌ అధ్యక్షులు సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అహ్మద్‌, పట్టణ అధ్యక్షుడు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, మట్టయ్య, నరేష్‌, సొందు, వేణు, రాజు, వెంకన్న, మాంగళ్య వెంకన్న, అనాసపురం యూసుఫ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement