సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో గ్రామసభలు నిర్వహించాం. నో మ్యాపింగ్, ఎనామలీ కేసులను గుర్తించి వారికి నోటీసులు అందించాం. తొలిరోజు 4 వేలమందికి పైగా నోటీసులు ఇచ్చాం. రెండు మూడు రోజుల్లోనే మిగతావారికి ఇస్తాం. ఈ నోటీసులు అందుకున్న వారంతా 12 రకాల ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను ఆధారంగా చూపించి తిరిగి ఓటు హక్కును పొందాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు సైతం సంబంధిత ఫారాలతో దరఖాస్తులు అందించాలి.
–తేజస్ నంద్‌లాల్ పవార్, కలెక్టర్


