ఆధారాలు చూపిస్తేనే ఓటు | - | Sakshi
Sakshi News home page

ఆధారాలు చూపిస్తేనే ఓటు

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి తుదిదశ ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ఓటర్ల జాబితాను, తొలగించిన ఓటర్ల వివరాలను, నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచడమే కాకుండా చదివి వినిపించారు. ఇప్పటికే మ్యాపింగ్‌ కాని వారితో పాటు అనామలీస్‌ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్‌ఓల ద్వారా నోటీసుల జారీ ప్రక్రియ చేపట్టారు. నోటీసులు అందుకునే వారంతా నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,90,676 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నారు.

నో మ్యాపింగ్‌,

ఎనామలీ కేటగిరీలకు..

జిల్లావ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌కు ముందు 10,08,252 మంది ఓటర్లు ఉండగా, డిజిటలైజేషన్‌ అనంతరం 9,11,945 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. మిగతా వారిలో మృతిచెందిన వారు 26,059 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 48,310 మంది కాగా, ఇతర కారణాలతో మొత్తంగా 96,307 ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ముసాయిదా జాబితాలో పేరున్న ఓటర్లలో వివిధ రకాల తప్పుల కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నోటీసులు అందించనుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నో మ్యాపింగ్గా గుర్తించిన ఓటర్లకు, అలాగే సరైన వివరాలు అందించకపోవడం వల్ల ఎనామలీ కింద నమోదైన వారికి ఈ నోటీసులు అందనున్నాయి.

తొలిరోజు 4,796 మందికి..

జిల్లావ్యాప్తంగా నో మ్యాపింగ్‌ కింద 22,997 మందికి, ఎనామలీ కేటగిరీ కింద 1,70,463 మందికి కలిపి మొత్తంగా 1,90,676 మందికి నోటీసులు అందించాల్సి ఉంది. గురువారం చేపట్టిన గ్రామసభల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 1,896 మందికి, కోదాడలో 1,468 మందికి, సూర్యాపేటలో 1,318 మందికి, తుంగతుర్తిలో 114 మందికి మొత్తంగా 4,796 మందికి అధికారులు నోటీసులు అందజేశారు. ఇంకా 1,85,880 మంది ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారంతా అందులో పేర్కొన్న తేదీ, ప్రాంతంలో ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని బీఎల్‌ఓకు చూపించి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సి ఉంటుంది.

నియోజకవర్గం ఓటర్లు మొత్తం నోటీసులు ఇంకా

నోటీసులు అందించినవి ఇవ్వాల్సింది

హుజూర్‌నగర్‌ 2,27,398 43,204 1,896 41,308

కోదాడ 2,21,879 44,598 1,468 43,130

సూర్యాపేట 2,20,335 55,665 1,318 54,347

తుంగతుర్తి 2,42,333 47,209 114 47,095

ఫ జిల్లావ్యాప్తంగా ముగిసిన

గ్రామసభలు

ఫ ఓటరు జాబితాతోపాటు నోటీసులు అందే ఓటర్ల వివరాలు వెల్లడి

ఫ జిల్లాలో సుమారు

1,90,676 మంది ఓటర్లకు నోటీసులు

ఫ రేపటి నుంచి ఆధారాల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement