సూర్యాపేట టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లే మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని కుటుంబాలను దత్తత తీసుకున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ప్రతినెలా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఈ బస్సును ఏర్పాటు చేశారు. 51 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బస్సును ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఒక్కో విద్యార్థికి మూడు నుంచి
ఐదు కుటుంబాలు..
నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ‘ఫ్యామిలీ అడాప్షన్’ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి వైద్య విద్యార్థి మూడు నుంచి ఐదు కుటుంబాలను దత్తత తీసుకుని, ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఆర్‌టీసీ బస్సుల్లో గ్రామాలకు వెళ్లి ఎంపిక చేసుకున్న కుటుంబాలను సందర్శించారు.
విద్యార్థులకు అవగాహన కోసం..
కుటుంబాలను సందర్శించే సమయంలో విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి, ఆహార అలవాట్లు తదితర అంశాలను తెలుసుకుంటారు. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.. వాటిని ఎలా నివారించాలి.. చికిత్స ఎలా పొందాలి.. అనే అంశాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు.
ఫ కుటుంబాలను దత్తత తీసుకున్న
మెడికల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం
ఫ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు
ఫ ప్రతినెలా బ్యాచ్‌లవారీగా
వెళ్లనున్న విద్యార్థులు


