భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ప్రభుత్వానికి బీ టీమ్‌గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ రెండో దశ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌ఏలు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లలో అక్షర దోషాలు, వ్యత్యాసాలు ఉంటే ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు కూడా ఫామ్ సిక్స్ ద్వారా తమ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ సమన్వయకర్త కుసుబా శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్


