సూర్యాపేటటౌన్ : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్‌వర్మ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆకారపు సాయి, నవీన్, మహేష్, గోపికృష్ణ, రిషిత ఇరుగు ఇందు,స్నేహ, అమత వర్షిణి, నవీన,శ్రీవాణి, హాసిని, గాయత్రి, లహరి పాల్గొన్నారు.


