ఆత్మకూరు(ఎం) : సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2006 ఆగస్టు 18న రాత్రి మావోయిస్టుల మెరుపుదాడితో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. ఆ భీకర దాడిలో ఎస్‌ఐ ఎండీ చాంద్ పాషా, ఏఎస్‌ఐ సుల్తాన్ మోహినొద్దీన్, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో కానిస్టేబుల్ కరీం ఏడాది పాటు మంచానికే పరిమితమై కన్నుమూశారు. ఈ దాడి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా, విధ్వంసకర దృశ్యాలు కనిపించాయి. స్టేషన్ ఆవరణ అంతా భయానకంగా మారింది. తోటి పోలీసు సిబ్బంది కొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్నారు. ఈ దారుణ సంఘటన జరిగి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రాణ త్యాగం చేసిన పోలీసులను మండల ప్రజలు, అధికారులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు.
ఆనాటి ఘటనలో మృతిచెందిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హోంగార్డు, కానిస్టేబుల్


