సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను పాత అలైన్‌మెంట్ ప్రకారమే చేపట్టాలని అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్‌రావు, డాక్టర్ రామ్మూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడారు.
పలువురి సంఘీభావం
రిలే నిరాహార దీక్షలకు రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ సంఘీభావం తెలిపారు. క్లాత్ మర్చంట్స్ సంఘం నాయకులు గండూరి శంకర్, డీటీఎఫ్, యూటీఎఫ్, టీపీటీఎప్ నాయకులు ఉమర్, డి.లాలు, ముప్పాని కృష్ణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు బండారు రాజా, వర్తక సంఘం అధ్యక్షుడు అంతకు విజయ్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు వజ్జే వీరయ్య, హైకోర్టు అడ్వకేట్ సత్తార్ ఖాన్ సంఘీభావం పలికారు. సాయంత్రం సుధాబ్యాంక్ అధినేత పెద్దిరెడ్డి గణేష్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పెద్దిరెడ్డి రాజా, రమణాచారి, మల్లు నాగార్జునరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, తండు శ్రీనివాస్‌యాదవ్, చల్లమల్ల నరసింహ, బెజవాడ వెంకటేశ్వర్లు, శివకుమార్, బూర మన్సూర్, కర్నాటి కిషన్ అనంతుల మధు, పేర్ల నాగయ్య, వనిత, కునుకుంట్ల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి


