నిర్వహణకు నీళ్లొదిలారు
పాలారం వద్ద మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నా. నెల రోజులుగా కాలువ నీళ్లు అందడంలేదు. సాగునీరు అందకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. ఇప్పటికై నా అధికారులు చివరి భూములకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి.
– మట్టపల్లి రామకోటయ్య, రైతు, పాలారం
పాలారం మేజర్ చివరి భూములకు సాగు నీరు అందకపోవడంపై రైతులు సమస్యను మా దృష్టికి తీసువచ్చారు. కాలువ పూర్తిగా లైనింగ్ చేయాలంటే ఆయకట్టు 10 వేల ఎకరాలకు పైగా ఉంటేనే సాధ్యపడుతుంది. పాలారం మేజర్ కాలువ 4820 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్నందున చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్లడం జరిగింది.
– తుమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఇరిగేషన్ ఏఈ
కాలువపై ఉన్న యూటీలు పగిలిపోయి నీరు వృథాగా పోతుంది. కాలువకు పూర్తిగా లైనింగ్ చేస్తే చివరి భూములకు నీరు అందుతుంది. అధికారులకు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా కాలువను మరోసారి పరిశీలించి రివిజన్ చేయాలని కోరుతున్నాం.
– గుర్రం వెంకట్‌రెడ్డి, రైతు, త్రిపురవరం
అనంతగిరి: పాలారం మేజర్–14బి కాలువలో నీరు ముందుకు కదలడం లేదు. కాలువ నిండా కంపచెట్లు, జమ్ము ఏపుగా పెరగడంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. కాలువ ప్రారంభంలో నీటి సరఫరా బాగానే ఉన్నా చివరి వరకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి సమస్య విన్నవించినా పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు.
4,820 ఎకరాల ఆయకట్టు
పాలారం మేజర్–14బి కాలువ నడిగూడెం మండలం సిరిపురం నుంచి అనంతగిరి మండలం పాలారం గ్రామం వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర విస్తరించి 4,820 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. నడిగూడెం మండలం వల్లాపురం వరకు పొలాలకు నీరు సక్రమంగానే అందుతున్నప్పటికీ అనంతగిరి మండలంలోని చివరి ఆయకట్టు గ్రామం త్రిపురవరం చేరుకునే వరకు నీటి ప్రవాహం మందగించి పోతుంది. సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టుకు సరిగా నీరందడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
యూటీలకు మరమ్మతులేవీ?
పాలారం మేజర్–14బి.. కాంటూరి కాలువ (నీరు ప్రవాహం నెమ్మదిగా వెళ్లేందుకు చేసిన కాలువ నిర్మాణం). కాలువలో పూడిక, నాచు, జమ్ము, గుర్రపుడెక్కతో నిండింది. అంతేకాకుండా కాలువ 8 యూటీ(అండర్ టన్నెల్)లను కలిగి ఉంది. యూటీలు పగిలిపోవడంతో పంటలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతుంది. ఇవి మరమ్మతులకు నోచుకోక రైతులకు మరో సమస్యగా మారింది. త్రి పురవరం, చనుపల్లి, పాలారం గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు నీరందక రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
‘పాలారం మేజర్–14బి’ చివరి భూములకు చేరని నీరు
ఫ కాలువ నిండా కంపచెట్లు, జమ్మి
ఫ ముందుకు సాగని నీటి ప్రవాహం
ఫ పగిలిపోయిన అండర్ టన్నెల్స్..వృథాగా పోతున్న నీరు
ఫ దాదాపు 2 వేల ఎకరాలకు ఇబ్బందులు
ఫ మరమ్మతులు చేపట్టి, లైనింగ్ ఏర్పాటు చేయాలని రైతుల వేడుకోలు
నిర్వహణకు నీళ్లొదిలారు
నిర్వహణకు నీళ్లొదిలారు
నిర్వహణకు నీళ్లొదిలారు
నిర్వహణకు నీళ్లొదిలారు


